ప్రకాశ్‌రాజ్‌ పై మంచు విష్ణు ఘనవిజయం !

ప్రకాశ్‌రాజ్‌ పై మంచు విష్ణు ఘనవిజయం !

Published on Oct 10, 2021 9:10 PM IST

‘మా’ ఎన్నికల పోలింగ్ విషయంలో రికార్డు స్థాయిలో ఓట్లు నమోదయ్యాయి. ఇప్పటివరకు మా చరిత్రలోనే ఈ స్థాయి పోలింగ్ జరగలేదు. ప్రస్తుతం మా ఎన్నికల ఫలితాలు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. ప్రకాశ్‌రాజ్‌ పై ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు ఘనవిజయం సాధించాడు.

మా అధ్యక్షుడిగా మంచు విష్ణు మొదటి నుంచి ఆధిక్యంలో కొనసాగుతూ వచ్చారు. చివరకు ప్రకాశ్‌రాజ్‌ పై విష్ణు విజయం సాధించారు. మరికాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక జాయింట్‌ సెక్రటరీగా మంచు విష్ణు ప్యానల్‌కు చెందిన గౌతమ్‌ రాజు విజయం సాధించారు. ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ నుంచి శ్రీకాంత్‌ గెలిచారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు