‘మా’ ఎన్నికల్లో ఎవరెవరు గెలిచారంటే..?

Published on Oct 10, 2021 11:09 pm IST

‘మా’ ఎన్నికల పోలింగ్ విషయంలో రికార్డు స్థాయిలో ఓట్లు నమోదయ్యాయి. ఇప్పటివరకు మా చరిత్రలోనే ఈ స్థాయి పోలింగ్ జరగలేదు. ప్రకాశ్‌రాజ్‌ పై ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు ఘనవిజయం సాధించాడు. మొదటి నుంచి ఆధిక్యంలో కొనసాగిన విష్ణు భారీ మెజార్టీతో విజయం సాధించడంతో మంచు విష్ణు ప్యానల్ సంబరాలు జరుపుకుంది.

మంచు విష్ణు ప్యానల్‌ నుంచి గెలుపొందింన ఆఫీస్‌ బేరర్లు వీళ్లే..

వైస్‌ ప్రెసిడెంట్‌గా మాదల రవి విజయం సాధించారు.

జనరల్‌ సెక్రటరీగా రఘుబాబు విజయం సాధించారు.

ట్రెజరర్‌గా శివబాలాజీ విజయం సాధించారు.

జాయింట్‌ సెక్రటరీగా గౌతమ్‌రాజు విజయం సాధించారు.

ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ నుంచి గెలుపొందింన ఆఫీస్‌ బేరర్లు వీళ్లే..

జాయింట్‌ సెక్రటరీగా ఉత్తేజ్‌ విజయం సాధించారు.

వైస్‌ ప్రెసిడెంట్‌గా బెనర్జీ విజయం సాధించారు.

ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా శ్రీకాంత్‌ విజయం సాధించారు.

సంబంధిత సమాచారం :