‘మా’ ఎన్నికలపై క్లారిటీ వచ్చేది ఆ రోజేనా?

Published on Jul 30, 2021 3:00 am IST

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) వ్యవహారం గత కొద్ది రోజులుగా తెలుగు చిత్ర పరిశ్రమలో దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. గత పాలక వర్గ పదవి కాలం ముగిసి ఎన్నిక ప్రకటన రాకముందే ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్‌, హేమ, సీవీఎల్‌ నరసింహారావు వంటి వారు ఈ సారి అధ్యక్ష బరిలో నిలుస్తున్నట్టు ప్రకటించారు. కొంత మంది ప్యానెల్ కూడా ఏర్పాటు చేసుకుని సీనియర్ల మద్ధతు కూడగట్టుకునే పనిలో ఉన్నారు. అయితే తాజాగా మా కార్యవర్గ పదవీకాలం ముగియడంతో కార్యవర్గ సభ్యులు ‘మా’ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ కృష్ణంరాజుకు లేఖ రాసి ఎన్నికలు నిర్వహించాలని కోరారు.

అయితే దీనిపై కృష్ణంరాజు నేతృత్వంలో తాజాగా ఆన్‌లైన్‌ ద్వారా ‘మా‘ కార్యవర్గ సమావేశం జరిగింది. ఇందులో సెప్టెంబర్‌ 12న మా అధ్యక్ష ఎన్నికలు జరపాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపధ్యంలోనే ఆగస్టు 22న ‘మా’ జనరల్‌ బాడీ సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో మా ఎన్నిక తేదీపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది.

సంబంధిత సమాచారం :