మా ఎన్నికలు : తన ప్యానల్లో ఎవరెవరో అనౌన్స్ చేసిన మంచు విష్ణు.!

Published on Sep 23, 2021 4:00 pm IST


టాలీవుడ్ కి చెందిన “మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్” కు సంబంధించి ఈ ఏడాది ఎన్నికలు మంచి రసవత్తరంగా సన్నద్ధం అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. దీనికి కారణం చాలామంది ప్రముఖ నటులు పోటీలో ఉండడమే అని చెప్పాలి.

మరి వచ్చే అక్టోబర్ 10న టాలీవుడ్ లో అట్టహాసంగా పోలింగ్ జరగబోతున్న ఈ ఎన్నికల హీట్ లో ఇప్పుడు ప్రెసిడెంట్ గా పోటీ చెయ్యబోతున్న మంచు వారి హీరో మంచు విష్ణు తన ప్యానల్ ని అనౌన్స్ చెయ్యడం జరిగింది. గత కొన్ని రోజులుగా ఆసక్తిగా ఉన్న వీరి ప్యానల్ పై ఇప్పుడు ఎట్టకేలకు ఒక క్లారిటీని విష్ణు ఇచ్చాడు. మరి ఈ ప్యానల్ ని పరిశీలిస్తే..

ప్రెసిడెంట్ గా విష్ణు, వైస్ ప్రెసిడెంట్స్ గా మద్దాల రవి, 30 ఇయర్స్ పృథ్వీ బాలిరెడ్డి, అలాగే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా నటులు బాబు మోహన్, జాయింట్ సెక్రటరీలుగా కరాటే కళ్యాణి మరియు గౌతమ్ రాజులు పేర్లు వెల్లడించారు. అలాగే నటుడు రఘుబాబు జెనరల్ సెక్రటరీగా శివ బాలాజీ ట్రెజరర్ గా ఉంటారని తెలిపారు. మరి వీరితో పాటుగా వీరి ప్యానల్ లో మరింత మంది కీలక నటులు కూడా ఉన్నారు.

నటి అర్చన. పూజిత, శ్రీనివాసులు, అశోక్ కుమార్, రాజేశ్వరి రెడ్డి, స్వప్న మాధురి, గీతా సింగ్, రేఖ, విష్ణు బొప్పన, హరినాత్ బాబు, సంపూర్ణేష్ బాబు, వడ్లపట్ల, ఇంకా జయవాణి, శశాంక్, మలక్ పేట శైలజ, శివన్నారాయణ సహా మాణిక్ మరియు శ్రీ లక్ష్మీ లు ఉన్నట్టుగా వెల్లడించారు. మరి జూబ్లీ హిల్స్ లో వచ్చే అక్టోబర్ 10న జరిగే ఈ ఎన్నికల్లో వీరి ప్యానల్ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని విష్ణు కోరాడు.

సంబంధిత సమాచారం :