‘మా’ ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్..!

‘మా’ ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్..!

Published on Sep 17, 2021 8:45 PM IST


తెలుగు సినీ పరిశ్రమలో హీట్ పుట్టిస్తున్న మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. అక్టోబర్ 10న (ఆదివారం) ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో పోలింగ్‌ జరగనుంది. ఎనిమిది మంది ఆఫీస్ బేరర్లు, 18 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ల కోసం ఎన్నిక నిర్వహిస్తున్నట్టు ఎన్నికల అధికారి వి.కృష్ణమోహన్‌ తెలిపారు. ఈ నెల 27 నుంచి 29 వరకూ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని, 30న నామినేషన్ల పరిశీలన జరుగుతుందని తెలిపారు.

ఇక నామినేషన్ల ఉపసంహరణకు వచ్చే అక్టోబర్ 1 నుంచి 2వ తేది సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంటుంది. అక్టోబర్ 2వ తేది సాయంత్రం బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. అక్టోబర్‌ 10న ఎన్నికలు, అదే రోజు రాత్రి ఏడు గంటలకు ఫలితాలు వెల్లడి కానున్నాయి.

‘మా’ ఎన్నికల నియమ నిబంధనలు:

* ఒక అభ్యర్థి ఒక పదవి కోసం మాత్రమే పోటీ చేయాలి.
* గత కమిటీలో ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయ్యి ఉండి, 50 శాతం కన్నా తక్కువ ఈసీ సమావేశాలకు హాజరు కాకపోతే పోటీ చేయడానికి అర్హత ఉండదు.
* 24 క్రాఫ్ట్స్‌లో ఆఫీస్‌ బేరర్స్‌గా ఉన్న వారు ఆ పదవులకు రాజీనామా చేయాలి లేదంటే ‘మా’ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు