పోలింగ్ ముగిసింది.. . రికార్డు స్థాయిలో ఓట్లు నమోదు !

Published on Oct 10, 2021 4:30 pm IST

మా’ ఎన్నికల్లో అతిరధ మహారధులు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పైగా ఈ సారి రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు అవ్వడం విశేషం. 700 పైగా ఓట్లు పోల్ అయినట్లు తెలుస్తోంది. మొత్తం 883 మందికి ఓటు హక్కు ఉండగా.. రికార్డు స్థాయిలో 82 శాతం వరకు ఓట్లు పోలవడం అంటే.. ఇది రికార్డే. ఇక మరో గంట తరువాత అనగా ఈ సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలు కానుంది. కాగా రాత్రి 8 గంటలకు ఫలితాన్ని ప్రకటించ బోతున్నారు.

ఇక ఎన్నికల్లో ఎక్కువ శాతం కళాకారులు ఎవరిని ఎన్నుకుంటే వారికే తన మద్ధతు ఉంటుంది అని ఇప్పటికే చిరంజీవి చెప్పుకొచ్చారు. అలాగే బాలయ్య కూడా ప్రకాశ్‌ రాజ్‌ గారు, తమ్ముడు విష్ణు సినిమా పరిశ్రమకు అన్నదమ్ముళ్ల లాంటి వారు. వాళ్లిద్దరూ సమర్థులే. ఐతే మా సభ్యుల అవసరాలు తీర్చడానికి ఎన్నికల్లో గెలిచిన వారిదే బాధ్యత కాదు, పరిశ్రమలోని అందరి పైన ఆ బాధ్యత ఉంది’ అంటూ బాలయ్య చెప్పుకొచ్చారు. కాబట్టి ఎవరు గెలిచినా వారికీ సినీ పెద్దల అండ ఉండనుంది.

సంబంధిత సమాచారం :