తారలపై అమర్యాదకరమైన విమర్శలపై పోలీస్ కంప్లైట్ !
Published on Oct 1, 2017 3:43 pm IST

సోషల్ మీడియా వలన ఎన్ని ప్రయోజనాలున్నాయో దాన్నిడ్దుర్వినియోగం చేయడం వలన అన్నే నష్టాలు కూడా ఉన్నాయి. ఈ నష్టం ముఖ్యంగా సినిమాలకు, సినీ తారలకు ఎక్కువగా తగులుతోంది. అభిమానులు తమ తమ హీరోల మీదున్న అభిమానంతో హద్దులు దాటి వేరే హీరోలను తీవ్ర స్థాయిలో విమర్శించడం వారి మీద అమర్యాదకరమైం పోస్టుల, ఫోటోలు పెట్టడం మరీ ఎక్కువైపోయింది.

ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యులు శివాజీ రాజా, మురళీ మోహన్ లు పేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ఈ తతంగంపై చర్యలు తీసుకోవాలని, అదే విధంగా హీరోలను కావాలోనే టార్గెట్ చేసి విమర్శలకు దిగుతున్న కొన్ని న్యూస్ పోర్టల్స్ పై కూడా చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. మరి హ్యాదులు దాటి, తారలకు, వారి సినిమాలకు ఇబ్బందిగా మారిన ఈ ట్రోలింగ్ ను పోలీసులైన అదుపులోకి తెస్తారో లేదో చూడాలి.

 
Like us on Facebook