అంచనాలు బాగా పెంచేసిన సుశాంత్ ‘మా నీళ్ల ట్యాంక్’ టీజర్

Published on Jun 27, 2022 5:11 pm IST

అక్కినేని హీరో సుశాంత్ ఇటీవల అల్లు అర్జున్, పూజా హెగ్డే ల కలయికలో తెరకెక్కిన అలవైకుంఠపురములో మూవీలో ఒక ముక్య పాత్ర చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఆ మూవీ మంచి సక్సెస్ తో బాగా పేరు దక్కించుకున్న సుశాంత్, అనంతరం ఇచ్చట వాహనములు నిలుపరాదు మూవీ ద్వారా ప్రేక్షలుల ముందుకు వచ్చారు. ఇక ప్రస్తుతం తొలిసారిగా ఆయన నటిస్తున్న వెబ్ సిరీస్ మా నీళ్ల ట్యాంక్. ప్రియా ఆనంద్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ లో సుదర్శన్, సీనియర్ నటి నిరోషా, ప్రేమ్ సాగర్, రామరాజు, అన్నపూర్ణమ్మ తదితరులు ఇతర పాత్రలు చేయగా ఇందులో సుశాంత్ సబ్ ఇన్స్పెక్టర్ గా కనిపించనున్నారు.

అయితే ఇటీవల రెండు రోజుల క్రితం యూట్యూబ్ లో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ టీజర్ అందరినీ ఎంతో ఆకట్టుకుని ఆడియన్స్ లో మంచి అంచనాలు ఏర్పరిచింది. ముఖ్యంగా హీరో సుశాంత్ టీజర్ లో పలికే డైలాగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ అలరించాయి. తనకు మంచి పాత్ర దక్కడంతో కొన్నేళ్ల గ్యాప్ తరువాత దీని ద్వారా మళ్ళి వెబ్ సిరీస్ లోకి రీఎంట్రీ ఇస్తున్నానని ఇటీవల హీరోయిన్ ప్రియా ఆనంద్ చెప్పారు. వరుడు కావలెను మూవీ దర్శకురాలు లక్ష్మి సౌజన్య తీసిన మా నీళ్ల ట్యాంక్ మొత్తంగా 8 ఎపిసోడ్స్ ఉంటుందని, పల్లెటూరి నేపథ్యంలో ఆహ్లాదంగా సాగె ఈ స్టోరీ తప్పకుండా ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. కాగా ఈ వెబ్ సిరీస్ జులై 15 నుండి ప్రముఖ ఓటిటి సంస్థ జీ 5 లో ప్రసారం కానుంది.

సంబంధిత సమాచారం :