“మా ఊరి పొలిమేర” చిత్రం ట్రైలర్ విడుదల

“మా ఊరి పొలిమేర” చిత్రం ట్రైలర్ విడుదల

Published on Dec 8, 2021 2:00 PM IST


ఒక గ్రామంలో చేతబడి జరిగినప్పుడు ఏం జరుగుతుంది? చేతబడి చేస్తున్న అనుమానంతో జరిగే హత్యను సమర్థించవచ్చా? డా.అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన మా ఊరి పొలిమేర చిత్రం చేతబడి మరియు జీవితాలపై అది చూపించే ప్రభావాన్ని నిశితంగా పరిశీలిస్తుంది. సత్యం రాజేష్, గెటప్ శ్రీను, బాల ఆదిత్య, కామాక్షి భాస్కర్ల, రవివర్మ మరియు చిత్రం శీను నటించిన ఈ చిత్రం
తెలంగాణ ప్రాంతంలోని ఒక మత్స్యకార గ్రామంలోని ప్రజల జీవితాల్లో చోటు చేసుకున్న ఘటనల ఆధారంగా తెరకెక్కించారు. చేతబడి మరియు చేతబడి చేశారన్న అనుమానంతో తన సోదరుడి హత్యను పరిశోధించే కానిస్టేబుల్ జీవితం చుట్టూ కథ తిరుగుతుంది. డిస్నీ+ హాట్‌స్టార్ తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేయడం జరిగింది. భోగేంద్ర గుప్తా నిర్మించిన మా ఊరి పొలిమేర డిసెంబర్ 10న డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రత్యేకంగా విడుదల కానుంది.

ఈ చిత్రం గురించి దర్శకుడు డా.అనిల్ విశ్వనాథ్ మాట్లాడుతూ, “మా ఊరి పొలిమేర చిత్రం మనల్ని గ్రామాలకు తోడ్కొని వెళుతుంది మరియు బ్లాక్ మ్యాజిక్ విషయానికి వస్తే సాధారణ పల్లెటూరి ప్రజల ఆలోచనలను మనకు తెలియజేస్తుంది. ఈ చిత్రం థ్రిల్లర్ మరియు హారర్ రెండు అంశాలను కలిగి ఉండగా, ఇది చాలా ప్రత్యేకమైన వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది. నటీనటులు మరియు సిబ్బంది
స్క్రీన్‌పై తమ ప్రాధాన్యతను తెలియజేస్తూ, తమ ఉనికిని తెలియజేసేందుకు చాలా కష్టపడ్డారు. ప్రేక్షకులు సినిమాను చాలా ప్రేమతో ఆదరిస్తారని ఆశిస్తున్నాను’’ అని తెలిపారు.

నటిగా మారిన వైద్యురాలు కామాక్షి భాస్కర్ల ఈ చిత్రంలో ప‌నిచేసిన తన అనుభ‌వాన్ని పంచుకుంటూ, “మా ఊరి పొలిమేర చాలా విలక్షణమైన ప్రాజెక్ట్, ఎందుకంటే నేను పూర్తిగా భిన్నమైన పాత్రను ఇందులో పోషించాను. ఒక మోటు పాత్రను పోషించడం సంప్రదాయ నగర యువతికి చాలా భిన్నంగా ఉంటుంది. సహజంగానే, నేను ఈ చిత్రం కోసం తెలంగాణ యాసను బాగా అభ్యాసం చేయవలసి వచ్చింది, మరియు గ్రామీణ మహిళల కఠినమైన బాడీ లాంగ్వేజ్ అధ్యయనాన్నీ చాలా కష్టపడి చేశాను. ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నాను” అని తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు