డిజిటల్ ప్రీమియర్ కి డేట్ ఫిక్స్ చేసుకున్న శింబు “మానాడు”

Published on Dec 17, 2021 8:00 pm IST

ప్రస్తుతం వస్తున్న సినిమాలు థియేటర్ల లో విడుదల అయిన కొద్ది రోజుల్లోనే డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. శింబు మరియు కళ్యాణి ప్రియ దర్శిని జంటగా నటించిన తాజా చిత్రం మా నాడు. ఈ చిత్రం ఎట్టకేలకు డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అయింది.

వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 24 వ తేదీన సోనీ లివ్ లోకి రానుంది. పొలిటికల్ సైన్స్ ఫిక్షన్ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రం లో ఎస్ జే సూర్య కీలక పాత్రలో నటించారు. డిజిటల్ ప్రీమియర్ గా వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏ తరహ లో ఆకట్టుకుంటుందొ చూడాలి.

సంబంధిత సమాచారం :