లేటెస్ట్ : రవితేజ ‘ధమాకా’ మెయిన్ క్యారెక్టర్స్ పోస్టర్స్ రివీల్

లేటెస్ట్ : రవితేజ ‘ధమాకా’ మెయిన్ క్యారెక్టర్స్ పోస్టర్స్ రివీల్

Published on Dec 22, 2022 6:00 PM IST

మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ధమాకా. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు ఎంతో భారీ స్థాయిలో నిర్మించగా త్రినాధరావు నక్కిన ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఇటీవల ధమాకా నుండి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ ఇలా అన్ని కూడా ఆడియన్స్, ఫ్యాన్స్ ని ఎంతో ఆకట్టుకుని మూవీ పై భారీగా అంచనాలు ఏర్పరిచాయి.

ఇక రేపు గ్రాండ్ గా ప్రేక్షకాభిమానుల ముందుకి రానుంది ధమాకా. డబుల్ ఇంపాక్ట్ అనే ట్యాగ్ లైన్ తో రవితేజ డ్యూయల్ రోల్ లో రూపొందిన ధమాకా మూవీలో మెయిన్ క్యారెక్టర్స్ పోషించిన పలువురు దిగ్గజ నటుల ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని కొద్దిసేపటి క్రితం ఒక్కొక్కటిగా తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా రివీల్ చేసారు మేకర్స్.

ముందుగా ఇందులో జెపి అనే పాత్రలో మలయాళ నటుడు జయరాం పోస్టర్ ని రివీల్ చేసిన యూనిట్, అనంతరం నందగోపాల్ చక్రవర్తిగా కనిపించనున్న సచిన్ ఖేడేకర్, వాసుదేవరావు గా కనిపించనున్న తనికెళ్ళ భరణి, దేవకి పాత్రలో కనిపించనున్న తులసి, అలానే యశోద గా కనిపించనున్న పవిత్ర లోకేష్ ల లుక్స్ ని రిలీజ్ చేసారు. మొత్తంగా మొదటి నుండి అన్ని విధాలుగా అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ధమాకా పై అటు టాలీవుడ్ లో కూడా పాజిటివ్ బజ్ ఉంది. కాగా ప్రస్తుతం రిలీజ్ చేసిన మెయిన్ క్యారెక్టర్స్ యొక్క పోస్టర్స్ కూడా ఆకట్టుకుంటుండడంతో రేపు రిలీజ్ అనంతరం తప్పకుండా తమ మాస్ రాజా నటించిన ధమాకా మంచి సక్సెస్ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది యూనిట్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు