ఇంటర్వ్యూ : ‘మట్టి కుస్తీ’ అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ – హీరో విష్ణు విశాల్

ఇంటర్వ్యూ : ‘మట్టి కుస్తీ’ అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ – హీరో విష్ణు విశాల్

Published on Nov 26, 2022 9:06 PM IST

 

రవితేజ టీమ్ వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్స్ కలిసి సంయుక్తంగా ఎంతో భారీ స్థాయిలో నిర్మిస్తున్న లేటెస్ట్ స్పోర్ట్స్ బేస్డ్ భారీ యాక్షన్ కమర్షియల్ డ్రామా మూవీ మట్టి కుస్తీ. తమిళ్ లో గట్టా కుస్తీగా రూపొందుతోన్న ఈ మూవీ పై తెలుగుతో పాటు తమిళ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి హీరో హీరోయిన్స్ గా రూపొందుతున్న ఈ మూవీకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. కాగా డిసెంబర్ 2 న గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఈ మూవీ గురించి నేడు తన అనుభవాలు మీడియాతో పంచుకున్న హీరో విష్ణు విశాల్ తో ప్రత్యేక ఇంటర్వ్యూ.

 

‘మట్టి కుస్తీ’ మూవీ గురించి చెప్పండి ?

ఇది ఇద్దరు భార్య భర్తల మధ్యన జరిగే ఇగోల కుస్తీ కథ. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ కేరళ కు చెందిన అమ్మాయి కావడం, అలానే అక్కడ మట్టి కుస్తీ ఆటకు ఎంతో ప్రాచుర్యం ఉండడంతో దానినే సినిమా పేరుగా పెట్టాం. అయితే ఈ సినిమాలో స్పోర్ట్స్ బేస్డ్ డ్రామా కూడా ఉంటుంది. ఇక భార్యాభర్తల మధ్య ఆలోచనలు, వారి అంచనాలు గురించి అలానే వారు కుటుంబ జీవితంలో ఎదుర్కొనే పలు ఇగోల గురించి ప్రస్తావిస్తూ అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా సాగె వినోదాత్మక కమర్షియల్ ఎంటర్టైనర్. అయితే మధ్యలో కుస్తీ స్పోర్ట్ కొంతమేర ఉంటుంది. ఒకరకంగా ఈ రకమైన మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ చేయడం ఇదే నా కెరీర్ లో ప్రధమం.

 

సినిమాలో స్పోర్ట్ ఎంత సేపు ఉంటుంది ?

ఈ మూవీలో మంచి సర్ప్రైజ్ ఎలిమెంట్స్ కొన్ని ఉన్నాయి. ఇక ఇందులో కుస్తీ ఆట 20 నిమిషాలకు పైనే ఉంటుంది. మూవీలో నేను ఒక కబడ్డీ ప్లేయర్ ని కానీ మట్టి కుస్తీ ఆటలో పాల్గొనాల్సి వస్తుంది. అయితే అది ఎందుకు అనేది మంచి సర్ప్రైజింగ్ ఎలిమెంట్. అలానే ఎమోషన్స్ తో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. వెయ్యి అబద్దాలు చెప్పి ఒక పెళ్లి చేయాలంటారు, అయితే మనం రెండే అబద్దాలు ఆడి ఈ పెళ్లి చేసాం అనేది ట్రైలర్ లో చూపించాము. అవి ఏమిటి, వాటితో హీరో హీరోయిన్స్ జీవితాలు ఏవిధంగా ముడిపడి సాగాయి అనేది మెయిన్ కథాంశం. ఈ మూవీ ట్రైలర్ కట్ కోసం ఎంతో ఆలోచనలు చేసాము. టీజర్ రిలీజ్ టైం లో స్పోర్ట్ ని చూపించడం, అలానే ట్రైలర్ రిలీజ్ టైం లో ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ వంటి అంశాలు చూపించాము. ఆ విధంగా మూవీ స్టోరీ లో మెయిన్ పాయింట్ ఎక్కడా రివీల్ కాకుండా ఆసక్తికరంగా ఉండేలా టీజర్, ట్రైలర్ రిలీజ్ చేసి ఆడియన్స్ లో మంచి క్యూరియాసిటీ కలిగించాం, తప్పకుండా రేపు రిలీజ్ తరువాత మూవీ చూసిన ఆడియన్స్ అందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ లభిస్తుందనే నమ్మకం మా యూనిట్ కి ఉంది.

 

భార్య భర్తల మధ్య సాగే కథ అన్నారు, మరి కామెడీ ఏమైనా ఉంటుందా ?

తప్పకుండా ఈ మూవీలో మంచి కామెడీ అంశాలు ఉన్నాయి. భార్య భర్తల జీవితంలో మధ్యలో కొన్ని సందర్భాల్లో ఇగోలు సహజం, అలానే ఈ మూవీలో మగ. ఆడ ఇద్దరూ సమానమే అని చూపించాము, అయితే అది సందేశాత్మకంగా కాకుండా ఒకింత వినోదాత్మకంగా అందరినీ ఆకట్టుకునేలా చూపించాము. తప్పకుండా మహిళా ప్రేక్షకులకి కూడా మా మట్టి కుస్తీ ఎంతో నచ్చుతుంది.

 

ఈ మూవీ నటీనటుల గురించి ?

ఇది నిజంగా టీమ్ వర్క్ తో చేసిన మూవీ. మునిష్ కాంత్, కరుణ, కింగ్స్లి పాత్రలు ఎంటెర్టైనింగ్ గా వుంటాయి. తెలుగు నటులు అజయ్ గారు విలన్ గా చేశారు. శత్రు గారు మరో నెగిటివ్ పాత్రలో కనిపిస్తారు. ప్రతి పాత్రధారి తమ పాత్రలో ఒదిగిపోయి నటించారు.

 

మాస్ మహారాజ రవితేజ గారి గురించి చెప్పండి, ఆయన అసలు ఈ ప్రాజక్ట్ లోకి ఎలా వచ్చారు ?

నిజానికి నేను చేసిన ఎఫ్ ఐ ఆర్ మూవీ రిలీజ్ టైం లో ఒక ఫ్రెండ్ ద్వారా ఆయనని కలిసాను. అదే టైంలో నా గత సినిమాలని ఆయన చూడడంతో పాటు తనకి ఎఫ్ ఐ ఆర్ ట్రైలర్ కూడా ఎంతో నచ్చడంతో తానే మూవీని ప్రెజెంట్ చేసారు. అయితే అదే సమయంలో నా నెక్స్ట్ ప్రాజక్ట్ గురించి ఆయన అడగడం జరిగింది. ఈ మూవీ అనుకుంటున్నాను సర్ అంటూ మట్టి కుస్తీ కథ చెప్పాను. ఆయన అది విన్న వెంటనే, కథ అదిరింది తప్పకుండా దీనిని నేను ప్రొడ్యూస్ చేస్తాను అని అన్నారు. ఆ విధమా ఈ మూవీ రూపుదిద్దుకుంది. నిజానికి నా గురించి తెలిసిన వాళ్ళు నా కెరీర్, నా మార్కెట్, బడ్జెట్ గురించి అడుగుతారు. కానీ రవితేజ గారు మాత్రం అలా కాకుండా కేవలం నా మీద, స్టోరీ మీద నమ్మకంతో ఈ మూవీ నాతో చేసారు. ఆయనకి నా లైఫ్ లో ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. తప్పకుండా మూవీ మంచి విజయం అందుకుని అందరినీ అలరిస్తుందని భావిస్తున్నాను.

 

ఫస్ట్ క్రికెటర్ అయిన మీరు, తరువాత యాక్టర్ అయ్యారు ? ఇవి రెండూ ఎలా కుదిరాయి ?

నిజానికి ఎవరిని అయినా ప్రేమించిన అమ్మాయి ఇష్టమా లేక పెళ్లి చేసుకున్న అమ్మాయి ఇష్టమా అని అడిగితే ఎవరైనా ఏమి చెప్తారు చెప్పండి, ఇద్దరూ ఇష్టమే అంటారు . ఆ విధంగా ప్రేమించిన క్రికెట్, పెళ్లి చేసుకున్న సినీ కెరీర్ రెండూ ఇష్టమే అంటాను.

 

మీ కెరీర్ లో డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయా ?

క్రికెటర్ గా అలానే సూపర్ హీరో తరహా పాత్రలు చేయాలని ఉంది.

 

ప్రస్తుతం టాలీవుడ్ పై కోలీవుడ్ దృష్టి కోణం ఎలా ఉంది ?

ప్రతి ఇండస్ట్రీ కి ఒక యూనీక్ నెస్ ఉంది. తెలుగు ఇండస్ట్రీ నుండి బాహుబలి సిరీస్ మూవీస్ తరువాత మరింత ఖ్యాతి లభించింది. అనంతరం ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్, విక్రమ్, కాంతారా ఇలా ప్రతి సౌత్ ఇండస్ట్రీ నుండి గొప్ప గొప్ప సినిమాల రాక మరింతగా పెరిగింది. ముఖ్యంగా ప్రస్తుతం ఇండియన్ సినిమాలో సౌత్ సినిమా గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు.

 

రాత్ససన్ మూవీకి ముందు, ఆ తరువాత మీ మూవీ కెరీర్ ఎలా ఉంది ?

నిజానికి ఆ మూవీ నాకు చాలానే పాఠాలు నేర్పింది. ఆడియన్స్ యొక్క ఆలోచన, దృష్టి కమర్షియాలిటీ నుండి కంటెంట్ వైపు మారిందని దానితో అర్ధం అయింది. అందుకే అప్పటి నుండి కంటెంట్ తో కూడిన మంచి కమర్షియల్ అంశాలు కలిగిన సినిమాలు చేస్తున్నాను. ఇటీవల వచ్చిన ఎఫ్ ఐ ఆర్ తో పాటు ప్రస్తుతం తెరెక్కిన మట్టి కుస్తీ కూడా అటువంటి తరహా సినిమానే.

 

జ్వాలా, మీరు కలిసి యాక్ట్ చేస్తారా ?

నిజానికి తనకు నటన మీద పెద్దగా ఆసక్తి లేదు. అయితే ఎక్కువగా సినిమాలు చూసే అలవాటు మాత్రం ఉంది. అప్పుడెప్పుడో ఒక పాట లో కనిపించిన విషయాన్ని ఇప్పటికీ గుర్తు చేసుకుని రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటుంది. తనని ఇకపై ఎప్పుడూ యాక్ట్ చేయమని అడగొద్దని గట్టిగా చెప్పింది అంటూ నవ్వుతూ చెప్పారు విష్ణు విశాల్.

 

మీ న్యూ ప్రాజక్ట్స్ ?

నా నిర్మాణంలోనే మొత్తంగా మూడు సినిమాలు వున్నాయి. అలానే మోహన్ దాస్ మూవీ చిత్రీకరణలో వుంది. సత్యజ్యోతి దర్శకత్వంలో ఓ సినిమా వుంటుంది. జనవరిలో మరో సినిమా ప్రకటన వస్తుంది. రజనీకాంత్ గారి లాల్ సలాం చిత్రంలో నటిస్తున్నా. ప్రస్తుతానికి అయితే ఇవే. థాంక్యూ ఆల్ ది బెస్ట్

 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు