
గత శుక్రవారం విడుదలైన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ ‘మాయ’. జరగబోయేది(భవిష్యత్) ముందే తెలిస్తే ఎలా ఉంటుంది..? అనే ఉంటుంది అనే వైధ్యమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా కన్నడ రీమేక్ రైట్స్ ను అప్పుడే అమ్మేశారు. ‘ప్రేమ కధా చిత్రమ్’ను కన్నడలో రీమేక్ చేసిన నిర్మాతలు శ్రీధర్ రెడ్డి(ధనలక్ష్మి ప్రింటర్స్) & మురగప్పాన్ లు ‘మాయ’ సినిమా రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకున్నారు.
హర్షవర్ధన్ రాణే, అవంతిక, సుష్మ, నందినిరాయ్ నటినటులుగా రూపొందిన ‘మాయ’ చిత్రానికి జాతీయ ఉత్తమ దర్శకుడు అవార్డు గ్రహీత నీలకంఠ దర్శకత్వం వహించారు. ఎమ్.వి.కె.రెడ్డి, మధుర శ్రీధర్ నిర్మాతలు.