నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా సంయుక్తా మీనన్ హీరోయిన్ గా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై యువ నిర్మాత అభిషేక్ నామా నిర్మిస్తూ స్వయంగా తెరకెక్కిస్తున్న లేటెస్ట్ థ్రిల్లింగ్ యాక్షన్ పాన్ ఇండియన్ మూవీ డెవిల్. ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనే క్యాప్షన్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ తో పాటు మాయే చేసి అనే పల్లవితో సాగే ఫస్ట్ సాంగ్ ప్రోమో అందరినీ ఆకట్టుకున్నాయి.
ఇక తాజాగా ఈ సాంగ్ యొక్క ఫుల్ లిరికల్ వీడియో ని రిలీజ్ చేసారు మేకర్స్. హర్షవర్షన్ రామేశ్వర్ సంగీతం అందించిన ఈ సాంగ్ ని సిద్ శ్రీరామ్ ఆలపించగా ఆర్ వి సత్య రచించారు. ఆకట్టుకునే మెలోడియస్ ట్యూన్ తో ప్రస్తుతం ఈ సాంగ్ అందరినీ అలరిస్తూ యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో కొనసాగుతోంది. కాగా డెవిల్ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి నవంబర్ 24న పలు భాషల్లో రిలీజ్ చేయనున్నారు.