యూట్యూబ్ ని షేక్ చేస్తున్న ‘మాచర్ల నియోజకవర్గం’ ‘రా రా రెడ్డి’ సాంగ్ …. !

Published on Jul 21, 2022 4:37 pm IST


నితిన్ హీరోగా ఎడిటర్ ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి తొలిసారిగా మెగాఫోన్ పడుతున్న మూవీ మాచర్ల నియోజకవర్గం. అంజలి ఒక స్పెషల్ లో కనిపించనున్న ఈ మూవీలో నితిన్ కి జోడీగా కృతి శెట్టి, క్యాథరీన్ త్రెసా హీరోయిన్స్ గా నటిస్తుండగా మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఇక ఈ మూవీలో నితిన్ ఐఏఎస్ అధికారిగా కనిపించనుండగా ఎమ్యెల్యే రాజప్ప పాత్రలో ప్రముఖ నటుడు సముద్రఖని నటిస్తున్నారు. ఈ పొలిటికల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ పై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి.

అయితే విషయం ఏమిటంటే, లేటెస్ట్ గా మూవీ నుండి నితిన్ తో కలిసి అంజలి చిందేసిన రా రా రెడ్డి పల్లవితో సాగె మాస్ ఐటెం సాంగ్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేసింది యూనిట్. అదిరిపోయే మాస్ బీట్స్ తో ఆకట్టుకునేలా లిరిక్స్ తో రూపొందిన ఈ లిరికల్ సాంగ్, రిలీజ్ అయినప్పటి నుండి అటు యువత తోపాటు ఇటు మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ సాంగ్ ఏకంగా 20 మిలియన్ వ్యూస్ తో పాటు 300కె లైక్స్ సంపాదించి యూట్యూబ్ మ్యూజిక్ లో నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతూ ఉండడం విశేషం. కాగా ఈ మూవీని ఆగష్టు 12 న భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై నిఖితా రెడ్డి, సుధాకర్ రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :