ట్రైలర్ కంటే ముందుగా నితిన్ “మాచర్ల నియోజక వర్గం” నుండి మరొక ఫీస్ట్!

Published on Jul 24, 2022 11:29 pm IST


నితిన్ హీరోగా ఎం.ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా మాచర్ల నియోజక వర్గం. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిఖిత రెడ్డి, సుధాకర్ రెడ్డి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో నితిన్ సరసన హీరోయిన్ లుగా కృతి శెట్టి మరియు కేథరిన్ థెరిస్సా లు నటిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి, పాటలకు ఇప్పటికే ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

ఈ చిత్రం ను ఆగస్ట్ 12, 2022 న థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ కి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కి ముహూర్తం ఖరారు చేయగా, అంతకంటే ముందుగా మరొక ఫీస్ట్ తో టీమ్ సిద్దం అవుతోంది. జులై 26, 2022 ఉదయం 11:03 గంటలకు మాచెర్ల ధంకీ ను చిత్ర యూనిట్ విడుదల చేస్తున్నట్లు సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించడం జరిగింది. ఇప్పటికే ప్రచార చిత్రాలతో సినిమా పై అంచనాలు పెరగగా, ఈ మాచర్ల ధంకి పోస్టర్ మరింత ఆసక్తి గా ఉంది. మహతి స్వర సాగర్ సంగీతం సంగీతం అందిస్తున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :