మాస్ పోస్టర్ తో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన “మాచర్ల నియోజకవర్గం”

Published on Nov 12, 2021 5:00 pm IST

నితిన్ హీరోగా ఎం.ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం మాచర్ల నియోజకవర్గం. ఈ చిత్రాన్ని శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు విడుదలై ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం నుండి లేటెస్ట్ అప్డేట్ ను చిత్ర యూనిట్ ఒక మాస్ పోస్టర్ తో ప్రకటించడం జరిగింది.

ఈ చిత్రం ను వచ్చే ఏడాది ఏప్రిల్ 29 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది. ఈ సారి ధియేటర్ కే వచ్చేది. బంపర్ మెజారిటీ తో అంటూ చిత్ర యూనిట్ తెలిపింది. నితిన్ హీరోగా నటించిన లాస్ట్ మూవీ మాస్ట్రో చిత్రం డైరెక్ట్ డిజిటల్ గా విడుదల అయింది. ఈ చిత్రం పై కూడా అనేక రూమర్స్ వస్తుండటం తో సినిమా పై మేకర్స్ త్వరగా క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ప్రకటన తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :