త్వరలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా నితిన్ “మాచర్ల నియోజకవర్గం”

Published on Feb 5, 2023 12:00 pm IST

టాలీవుడ్ హీరో నితిన్ హీరోగా, డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కిన పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మాచర్ల నియోజక వర్గం. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులను ఆకట్టుకుంది. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం లో కృతి శెట్టి, కేథరిన్ థెరిస్సా లు లేడీ లీడ్ రోల్స్ లో నటించారు. ఇప్పుడు ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది.

త్వరలో ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జీ తెలుగు లో ప్రసారం కానుంది. సముద్ర ఖని, రాజేంద్ర ప్రసాద్, మురళి శర్మ, వెన్నెల కిషోర్, ఇంద్రజ, యాంకర్ శ్యామల తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :