కన్ఫర్మ్ న్యూస్ : అన్ స్టాపబుల్ షో కి మ్యాచో స్టార్ తోపాటు పాన్ ఇండియా స్టార్ కూడా

కన్ఫర్మ్ న్యూస్ : అన్ స్టాపబుల్ షో కి మ్యాచో స్టార్ తోపాటు పాన్ ఇండియా స్టార్ కూడా

Published on Dec 11, 2022 12:45 AM IST

ప్రస్తుతం ప్రముఖ ఓటిటి మాధ్యమం ఆహాలో ప్రసారం అవుతున్న క్రేజీ షో అన్ స్టాపబుల్ సీజన్ 2. నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఇప్పటికే పలు ఎపిసోడ్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న సీజన్ 2 యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పాటు మ్యాచో స్టార్ గోపీచంద్ కూడా పాల్గొననున్నారు. గత కొద్దిరోజులుగా అన్ స్టాపబుల్ షో కి ప్రభాస్ మరియు గోపీచంద్ రానున్నారు అనే వార్త పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.

అయితే మధ్యలో పలు కారణాల వలన వీరిద్దరి రాక కొంత ఆలస్యం అయిందని, కాగా ఫైనల్ గా రాబోయే నెక్స్ట్ ఎపిసోడ్ లో వీరిద్దరూ సందడి చేయనున్నారని తెలుస్తోంది. ఇక ఈ సూపర్ ఎపిసోడ్ ని రేపు ఎంతో గ్రాండ్ గా చిత్రీకరించేందుకు ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయట. మొత్తంగా ప్రస్తుతం ఈ న్యూస్ ని ప్రభాస్, గోపీచంద్ ఫ్యాన్స్ అందరూ కూడా ఆనందంతో పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు