‘మ్యాడ్ స్క్వేర్’ ఓవర్సీస్ రైట్స్ వీరికే!

‘మ్యాడ్ స్క్వేర్’ ఓవర్సీస్ రైట్స్ వీరికే!

Published on Jan 22, 2025 7:00 PM IST

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న క్రేజీ సీక్వెల్ చిత్రాల్లో ‘మ్యాడ్ స్క్వేర్’ కూడా ఒకటి. ఈ సినిమా గతంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘మ్యాడ్’కి సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమాను దర్శకుడు కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు.

ఇక ఈ సినిమాతో మరోసారి నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ తమ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన యూఎస్ రైట్స్‌ను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ వి సినిమాస్ సొంతం చేసుకుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేశారు.

ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు