
పెళ్లి తర్వాత సినిమాలు దూరమైన ఒకప్పటి అందాల తార, ‘రోజా’ ఫేం మధుబాల ‘అంతక ముందు ఆ తర్వాత’ సినిమాతో 13 ఏళ్ళ తర్వాత తెలుగు తెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీ ఎంట్రీ ఇచ్చారు. తల్లి పాత్రలో ఆమె నటనకు ప్రసంశలు లభించాయి. తాజాగా తెలుగులో మరో సినిమాకు సంతకం చేశారు. ‘కార్తికేయ’ సినిమా విజయం తర్వాత నిఖిల్ హీరోగా నటిస్తున్న ‘సూర్య vs సూర్య’లో కీలక పాత్రలో మధుబాల నటిస్తున్నారు. కాలేజీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎటువంటి పాత్రలో కనిపించనున్నారో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
‘బ్యూటిఫుల్ మధుబాల గారితో పని చేసే అవకాశం నాకు లభించింది’ అంటూ ‘సూర్య vs సూర్య’ లొకేషన్ లో దిగిన సేల్ఫీ ఫోటోను నిఖిల్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ మంగళవారం నుండి హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈ సినిమా ద్వారా ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘కార్తికేయ’ సినిమాల సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.