పెళ్లి సందD నుండి మధుర నగరి లో లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసిన రవి తేజ!

Published on Sep 29, 2021 12:30 pm IST

రోషన్ హీరోగా, శ్రీ లీలా హీరోయిన్ గా గౌరీ రొనంకి దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం పెళ్లి సందD. ఈ చిత్రం కి ప్రముఖ దర్శకుడు శ్రీ రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతలను తీసుకున్నారు. ఈ చిత్రం లో ఒక కీలక పాత్రలో కూడా నటిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, పాటలు, వీడియోలు ఇప్పటికే సినిమా పై భారీ అంచనాలను పెంచేశాయి. తాజాగా ఈ చిత్రం నుండి మధుర నగరి లో అంటూ ఒక పాట విడుదల అయ్యింది. ఈ పాట ను మాస్ మహారాజా రవితేజ విడుదల చేశారు.

చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాట ను శ్రీనిధి, నాయన నైర్ మరియు కాల భైరవ లు పాడటం జరిగింది. ఈ చిత్రానికి సంగీతం ఎం ఎం కీరవాణి అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

సంబంధిత సమాచారం :