“మధురపూడి గ్రామం అనే నేను” ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన దర్శకుడు హరీష్ శంకర్..!

Published on Oct 16, 2021 10:11 pm IST

శివ కంఠమనేని హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “మధురపూడి గ్రామం అనే నేను”. కళ్యాణ్ రామ్ “కత్తి” దర్శకుడు మల్లి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జి రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వరరావు నిర్మాతలు. దసరా పండగ శుభాకాంక్షలతో “మధురపూడి గ్రామం అనే నేను” సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ దర్శకుడు హరీష్ శంకర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హరీశ్ శంకర్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉందని, హీరో శివ కంఠమనేని, చిత్ర బృందానికి బెస్ట్ విషెష్ తెలిపారు.

ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ చూస్తే కథానాయకుడు విలన్ తల నరికి చేతిలో పట్టుకుని మరో చేత్తో ఒక మహిళను ఎత్తుకున్నారని, ఆమెను కాపాడేందుకే హీరో హత్య చేశాడా, మధురపూడి గ్రామం అనే నేను కథేంటి తెరపై చూడాలనే ఆసక్తి కలిగిస్తున్నాయని అన్నారు.

సంబంధిత సమాచారం :

More