“భారతీయుడు 2” రిలీజ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మదురై కోర్ట్!

“భారతీయుడు 2” రిలీజ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మదురై కోర్ట్!

Published on Jul 11, 2024 9:00 PM IST

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారతీయుడు చిత్రం కొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం రిలీజ్ ను ఆపాలి అంటూ రాజేంద్రన్ కోర్టు ను ఆశ్రయించారు. సినిమాలోని మర్మకళ సన్నివేశాల పై రాజేంద్రన్ అభ్యంతరం తెలిపారు. తన పుస్తకం ఆధారంగా సన్నివేశాలు తీశారన్న రాజేంద్రన్, అయితే పార్ట్‌ 1లోని సన్నివేశాలు కొనసాగించామని క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు. ఈ పిటిషన్ ను మదురై కోర్టు తోసిపుచ్చింది. అంతేకాక సినిమా విడుదలపై స్టే ఇవ్వలేమన్న స్పష్టం చేసింది మదురై కోర్టు.

ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సిద్దార్థ్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, ఎస్.జే. సూర్య లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి రాక్ స్టార్ అనిరుద్ రవి చందర్ సంగీతం అందించారు. భారతీయుడు చిత్రం పై ఉన్న అభిమానంతో ప్రేక్షకులు సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శంకర్, కమల్ ల మ్యాజిక్ మరోసారి రిపీట్ అవుతుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు