త్వరలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా నితిన్ “మాస్ట్రో”

Published on Jan 9, 2022 9:41 pm IST


నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం మాస్ట్రో. బ్లాక్ కామెడీ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం లో తమన్నా భాటియా, నబ్బా నటేష్ లు లేడీ లీడ్ రోల్స్ లో నటించడం జరిగింది. హిందీ లో సూపర్ హిట్ సాధించిన అంధ దూన్ చిత్రానికి ఇది రీమేక్ గా తెరకెక్కిన సంగతి అందరికి తెలిసిందే.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డైరెక్ట్ డిజిటల్ గా విడుదల అయిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యింది. స్టార్ మా లో ఈ చిత్రం త్వరలో ప్రసారం కానుంది. మహతి స్వర సాగర్ సంగీతం అందించిన ఈ చిత్రం ను శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డీ మరియు నికితా రెడ్డి లు సంయుక్తంగా నిర్మించడం జరిగింది.

సంబంధిత సమాచారం :