సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న “మహ సముద్రం”

Published on Oct 8, 2021 5:40 pm IST

శర్వానంద్, సిద్దార్థ్, అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యూయేల్ ప్రధాన పాత్రల్లో అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న చిత్రం మహా సముద్రం. ఈ చిత్రం విడుదల కి సిద్దం అయ్యింది. ఏ కే ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మించడం జరిగింది. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, విడియోలు, పాటలు సినిమా పై ఆసక్తిని పెంచేశాయి.

తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి, ఈ చిత్రాన్ని అక్టోబర్ 14 వ తేదీన ప్రేక్షకులను అలరించడానికి థియేటర్ల లోకి తీసుకు వస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది.జగపతి బాబు, రావు రమేష్, గరుడ రామ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం చైతన్ భరద్వాజ్ అందిస్తున్నారు. RX 100 చిత్రం తర్వాత అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటం తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :