“మహా సముద్రం” డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్!

Published on Oct 11, 2021 6:54 pm IST


ఆర్ ఎక్స్ 100 ఫేం డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వం లో శర్వానంద్, సిద్దార్థ్, అదితి రావు హైదరి, అను, ఎమ్మన్యూయెల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం మహా సముద్రం. ఈ చిత్రం విడుదల కి సిద్దం అయింది.అక్టోబర్ 14 వ తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు సినిమా పై ఆసక్తి ను పెంచేశాయి. తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన సరికొత్త ట్రైలర్ సైతం ప్రేక్షకులని, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

అయితే ఈ చిత్రం థియేట్రికల్ విడుదల అనంతరం ప్రముఖ ఓటిటి దిగ్గజం ప్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ లోకి రానుంది. డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ మంచి డీల్ కి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఏ కే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రామ బ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :