“మహా సముద్రం” డిజిటల్ రైట్స్ ను భారీ ధరకు కొనుగోలు చేసిన ప్రముఖ ఓటిటి దిగ్గజం!

Published on Sep 27, 2021 9:38 pm IST


శర్వానంద్, సిద్దార్థ్, అదితి రావు హైదరి, అను ఇమ్మన్యూయేల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం మహా సముద్రం. ఈ చిత్రం అక్టోబర్ 14 వ తేదీన విడుదల కి సిద్దం అవుతోంది. చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రమోషన్స్ ను షురూ చేయడం జరిగింది. ఈ చిత్రం నుండి విడుదల అయిన పాటలు, ట్రైలర్ సినిమా పై భారీ అంచనాలు పెంచేశాయి.

అయితే ఈ చిత్రం యొక్క డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటిటి దిగ్గజం భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్ ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుంది. మహా సముద్రం చిత్రం థియేటర్ల లో విడుదల అయిన కొద్ది వారాల తర్వాత నెట్ ఫ్లిక్స్ ప్రేక్షకులకు అందుబాటులో కి రానుంది. RX 100 తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం లో వస్తున్న చిత్రం కావడంతో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :