మహా సముద్రం చిత్రానికి టీఆర్పీ ఎంతంటే?

Published on Jan 7, 2022 12:12 am IST


శర్వానంద్, సిద్దార్థ్, అదితి రావ్ హైదరి, అను ఇమ్మన్యూయేల్ ప్రధాన పాత్రల్లో అజయ్ భూపతి దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం మహా సముద్రం. ఏ కే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మించడం జరిగింది. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి మిశ్రమ స్పందన దక్కించుకుంది. ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా విడుదల అయ్యి ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జెమిని టీవీ లో ప్రసారం అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మొదటి సారి 4.46 టీఆర్పీ రావడం జరిగింది. రొమాంటిక్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రం కి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :