“మహ సముద్రం” పై భారీ అంచనాలు!

Published on Oct 6, 2021 10:47 pm IST


శర్వానంద్, సిద్దార్థ్, అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం మహా సముద్రం. ఈ చిత్రానికి RX 100 ఫేం అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఏ కే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని సుంకర రామ బ్రహ్మం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అజయ్ సుంకర సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, విడియోలు విడుదల అయ్యి విశేష ఆదరణ దక్కించుకుంది.

ఈ చిత్రం నుండి విడుదలైన పాటలు సినిమా పై ఆసక్తిని పెంచేశాయి. ఈ చిత్రం అక్టోబర్ 14 వ తేదీన విడుదల అవుతుండటం తో సినిమా కోసం ప్రేక్షకులు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా నుండి విడుదల అయిన ప్రతి అప్డేట్ పై ప్రేక్షకులు ఆసక్తి కనబరచడం తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం కి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :