మహా సముద్రం మూవీ ప్రమోషన్స్ మామూలుగా లేవుగా!

Published on Sep 22, 2021 12:02 am IST


అజయ్ భూపతి దర్శకత్వం లో శర్వానంద్, సిద్దార్థ్, అదితి రావు హైదరి, అను ఇమ్మన్యూయెల్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మహా సముద్రం. ఈ చిత్రం అక్టోబర్ 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. అయితే ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సరికొత్త ప్రమోశన్స్ షురూ చేయడం జరిగింది. ఈ చిత్రం ట్రైలర్ ను సెప్టెంబర్ 23 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తోంది.

అయితే ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ లో పాల్గొనండి అంటూ ఒక కాంటెస్ట్ షురూ చేయడం జరిగింది. సెప్టెంబర్ 23 న AMB సినిమాస్ లో మహా సముద్రం ట్రైలర్ లాంచ్ లో పాల్గొనండి అంటూ చెప్పుకొచ్చారు.ఒక మోషన్ పోస్టర్ ను విడుదల చేసి, అందులో తమకి నచ్చిన పాత్రను షేర్ చేయండి అంటూ చెప్పుకొచ్చారు. ట్రైలర్ లాంచ్ లో భాగం అయ్యేందుకు ఇది ఒక అవకాశం అని చెప్పాలి. ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :