పవర్ ఫుల్ గా “మహ సముద్రం” ట్రైలర్!

Published on Sep 23, 2021 6:25 pm IST

శర్వానంద్, సిద్దార్థ్, అదితి రావు హైదరీ, అను ఇమ్మన్యూయేల్ ప్రధాన పాత్రల్లో అజయ్ భూపతి దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం మహా సముద్రం. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, పాటలు విడుదల అయి ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా చిత్ర యూనిట్ సినిమా కి సంబందించిన ట్రైలర్ ను విడుదల చేయడం జరిగింది.

ఈ ట్రైలర్ లో ప్రతి ఒక్క పాత్ర ను కూడా దర్శకుడు అజయ్ భూపతి తీర్చి దిద్దినట్లు తెలుస్తోంది. లవ్ స్టొరీ బ్యాక్ డ్రాప్ తో యాక్షన్ డ్రామా గా ఈ చిత్రం ను తెరక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం లో రావు రమేష్, జగపతి బాబు, కేజీఎఫ్ ఫేం గరుడ రామ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ను ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. RX 100 చిత్రం తర్వాత అజయ్ భూపతి అంతకుమించి ఇంటెన్స్ తో సినిమా ను తీర్చి దిన్ననట్లు తెలుస్తోంది. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 14 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :