23 వ తేదీన “మహా సముద్రం” ట్రైలర్ ను విడుదల చేయనున్న చిత్ర యూనిట్!

Published on Sep 20, 2021 4:42 pm IST

RX 100 లాంటి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించిన దర్శకుడు అజయ్ భూపతి ఇప్పుడు అదే తరహాలో హై ఇంటెన్స్ కథను సిద్ధం చేస్తున్నారు. మహ సముద్రం అంటూ శర్వానంద్, సిద్దార్థ్, అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యూల్ లతో సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ను అక్టోబర్ 14 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతుండటం తో అందుకు సంబంధించిన ప్రమోషన్స్ ను షురూ చేయడం జరిగింది.

ఈ చిత్రం ట్రైలర్ విడుదల తేదీ పై తాజాగా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ చిత్రం ట్రైలర్ ను ఈ నెల 23 వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది. ఈ చిత్రాన్ని ఏ కే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :