“మహాసముద్రం” ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిధిగా పవర్ స్టార్?

Published on Oct 7, 2021 10:12 pm IST


శర్వానంద్, సిద్దార్థ్ ప్రధాన పాత్రల్లో ఋX 100 ఫేం అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “మహాసముద్రం”. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 14న రిలీజ్ కాబోతుంది. ఈ నేపధ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఈ నెల 9వ తేదీన జరపబోతున్నారు.

అయితే హైదరాబాద్‌లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరగబోతున్న ఈ ప్రీ రిలీజ్ వేడుక కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను ముఖ్య అథితిగా ఆహ్వానించే ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తుంది. అయితే పవన్ షెడ్యూల్‌ని బట్టి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే అందుకు సంబంధించిన పోస్టర్‌ను వదలడానికి మేకర్స్ రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో అదితీరావు, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తుండగా, జగపతిబాబు, రావు రమేశ్ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :