లేటెస్ట్..దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థకు “మహా సముద్రం” హక్కులు.!

Published on Oct 13, 2021 9:00 am IST

ఈ దసరా మహోత్సవం సందర్భంగా తెలుగు సినిమా దగ్గర నుంచి రిలీజ్ కి రెడీ అవుతున్న పలు ఆసక్తికర చిత్రాల్లో దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఇంటెన్స్ యాక్షన్ డ్రామా “మహా సముద్రం”. శర్వానంద్ మరియు నటుడు సిద్ధార్థ్ ల కలయికలో తెరకెక్కిన ఈ చిత్రం చాలా మంది విలక్షణ నటుల కాస్ట్ తో తెరకెక్కింది. ఇక ఈ అక్టోబర్ 14 న రిలీజ్ కి రెడీగా ఉండగా ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులపై అధికారిక క్లారిటీ వచ్చేసింది.

ఈ చిత్రం తాలూకా స్ట్రీమింగ్ రైట్స్ ని దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నారట. మరి సినిమా రిలీజ్ అయ్యాక ఎంత టైం కి ఈ చిత్రం అందులో అందుబాటులోకి వస్తుందో అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో అను ఇమ్మానుయేల్ అలాగే అదితి రావు హైదరీలు హీరోయిన్స్ గా నటించగా చైతన్ భరద్వాజ్ సంగీతం అందించాడు. అలాగే అనిల్ సుంకర నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :