మాస్ లుక్ లో అదరగొడుతున్న మహానటి

Published on Mar 26, 2023 1:20 am IST

మహానటి మూవీతో కెరీర్ పరంగా ఎంతో గొప్ప పేరుతో పాటు ఏకంగా ఉత్తమ నటిగా జాతీయ పురస్కారం సొంతం చేసుకున్నారు అందాల నటి కీర్తి సురేష్. తొలిసారిగా టాలీవుడ్ కి నేను శైలజ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కీర్తి, ఆ మూవీలో తన ఆకట్టుకునే అందం అభినయంతో ఆడియన్స్ మనసు దోచారు. అక్కడి నుండి వరుసగా అనేక సినిమా ఆఫర్స్ అందుకుంటూ వాటితో పలు సక్సెస్ లు సొంతం చేసుకుంటూ దూసుకెళ్తున్న కీర్తి సురేష్, నాచురల్ స్టార్ నాని తో కలిసి లేటెస్ట్ గా నటించిన మూవీ దసరా. మాస్ యాక్షన్ రస్టిక్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీని శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించారు.

ఈ మూవీలో ధరణి పాత్రలో నాని అలానే వెన్నెల పాత్రలో కీర్తి కనిపించనున్నారు. ఇప్పటికే అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ మార్చి 30న పాన్ ఇండియా రేంజ్ లో పలు భాషల్లో ఆడియన్స్ ముందుకి రానుంది. అయితే విషయం ఏమిటంటే, శనివారపు సాయంత్రాన్ని సరదాగా ఎంజాయ్ చేస్తున్న వెన్నెల అంటూ దసరాలోని మాస్ చీరకట్టు లుక్ ని తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసారు కీర్తి సురేష్. ప్రస్తుతం ఆ పిక్ అందరినీ ఆకట్టుకుంటుండగా, తమ అభిమాన నటి దసరాతో పాన్ ఇండియన్ రేంజ్ లో సక్సెస్ అందుకోవాలని కోరుతూ పలువురు అభిమానులు కీర్తికి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా బెస్ట్ విషెస్ తెలియచేస్తున్నారు.

సంబంధిత సమాచారం :