‘మహానటి’ విడుదల తేది ఖరారు !

తెలుగు సినిమా గర్వించదగ్గ నటి సావిత్రి. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి సినిమా ఇండస్ట్రీ లో నిలదొక్కుకున్న ఆమె జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మహానటి’. ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రంతో దర్శకుడిగా మారిన నాగ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా మార్చి 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మిస్తున్నాడు. కీర్తి సురేష్‌ టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాలో సమంత మరియు షాలిని పాండే ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. సావిత్రి భర్తగా దుల్కర్‌ సల్మాన్‌ నటిస్తోన్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళంలో కూడా ఒకేసారి తెరకెక్కించి ఒకే సమయంలో విడుదల చేయబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే విడుదలైన చిన్నపాటి వీడియో కూడా ఆసక్తికరంగా ఉండి అందరినీ ఆకట్టుకుంటోంది.