భారీ ధర పలికిన ‘మహానటి’ ఓవర్సీస్ హక్కులు !


దర్శకుడు నాగ్ అశ్విన్ అలనాటి నటి సావిత్రి జీవితం ఆధారంగా ఒక ‘మహానటి’ పేరుతో ఒక చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. చాలా రోజులపాటు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకున్న ఈ చిత్రంలో సావిత్రిగా కీర్తి సురేష్, జెమినీ గణేశన్ గా దుల్కర్ సల్మాన్, మరొక ప్రధాన పాత్రలో స్టార్ హీరోయిన్ సమంత నటిస్తుండంతో ప్రాజెక్టుకు ఎనలేని క్రేజ్ ఏర్పడింది. దీంతో చిత్ర హక్కులకు కూడా మంచి డిమాండ్ ఏర్పడింది.

ముఖ్యంగా ఓవర్సీస్ హక్కులైతే ఊహించని భారీ ధరకు అమ్ముడయాయ్యి . డిస్ట్రిబ్యూషన్ సంస్థ నిర్వాణ సినిమాస్ ఈ హక్కుల్ని రూ.4.5 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి హాలీవుడ్ సినిమాటోగ్రఫర్ డాని శాంచెజ్ లోపెజ్ పని చేస్తున్నారు. అశ్విని దత్ కుమార్తె స్వప్న దత్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో కూడా రూపొందించనున్నారు.