లేటెస్ట్ వీడియో : మిడిల్ క్లాస్ అబ్బాయితో బ్యాడ్మింటన్ ఆడుతున్న మహానటి

Published on Feb 25, 2023 1:02 am IST

నాని, కీర్తి సురేష్ ల కలయికలో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో లేటెస్ట్ గా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ మూవీ దసరా. మాస్ యాక్షన్ రస్టిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ అందరినీ ఎంతో ఆకట్టుకుని మూవీ పై భారీ అంచనాలు ఏర్పరిచాయి. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ మూవీని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

ఇక నేడు నాని బర్త్ డే సందర్భంగా ఆయనకి విషెస్ తెలిపిన కీర్తి, సరదాగా ఆయనతో కలిసి బ్యాడ్మింటన్ ఆడుతున్న వీడియోని నేడు కొద్దిసేపటి క్రితం తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసారు. కాగా ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. నేను లోకల్ తరువాత మరొక్కసారి ఈ జోడి కలిసి నటిస్తున్న దసరా మూవీ ఎంత మేర విజయం అందుకుంటుందో తెలియాలి అంటే ఈ మూవీ రిలీజ్ డేట్ అయిన మార్చి 30 వరకు ఆగాల్సిందే. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీలో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వాహబ్ తదితరులు ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :