పలు రికార్డుల్ని బ్రేక్ చేసే దిశగా ‘మహానటి’ !


కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ రూపొందిన బయోపిక్ ‘మహానటి’ విశేషమైన ప్రేక్షకాదరణను పొందుతోంది. అలనాటి నటి సావిత్రిగారి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం కావడం, నాగ్ అశ్విన్ తన దర్శకత్వ ప్రతిభను చూపడం, కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్, సమంత వంటి నటీనటుల అద్భుతమైన నటన, మిక్కీ జె మేయర్ సంగీతం అన్నీ కలిసి సినిమాను ఉన్నత స్థాయిలో నిలబెట్టాయి.

తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు మంచి ఆదరణ దక్కుతుండగా ఓవర్సీస్ ప్రేక్షకులైతే బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే 1.8 మిలియన్ డాలర్లను కొల్లగొట్టి ఆల్ టైమ్ హైయస్ట్ తెలుగు గ్రాసర్ల జాబితాలో 13వ స్థాన్నాన్ని దక్కించుకున్న ఈ సినిమా పూర్తి రన్ ముగిసేనాటికి పలు పాత రికార్డుల్ని బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

Exit mobile version