రెండవరోజు కూడా మంచి పెర్ఫార్మెన్స్ చూపించిన ‘మహానుభావుడు’ !


యంగ్ హీరో శర్వానంద్ నటించిన ‘మహానుభావుడు’ చిత్రం మొదటిరోజు మొదటి షో నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని మంచి రన్ తో నడుస్తోంది. సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ చూడదగిన ఎంటర్టైనర్ గా ఉండటంతో విడుదలైన ప్రతిచోటా హౌస్ ఫుల్ కలెక్షన్లను రాబడుతోంది. కేవలం తెలుగు రాష్ట్రాలకు మాత్రమే గాక యూఎస్ లో సైతం సినిమాకు ఇదే తరహా స్పందన లభిస్తోంది.

మొదటి శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా రూ.3.8 కోట్ల షేర్ ను రాబట్టిన ఈ సినిమా రెండవ రోజు ఇంకాస్త పుంజుకోగా రెండు రోజులకు కలిపి రూ.6.8 కోట్ల షేర్ మరియు రూ.13.5 కోట్ల గ్రాస్ వసూలయ్యాయి. చిత్రానికి లభిస్తున్న స్పందనకి తోడు ఈ వారంలో కొత్త సినిమాలేవీ విడుదలకాకపోతుండటంతో కలెక్షన్లు ఇలాగే బలంగా కొనసాగనున్నాయి. మారుతి దర్శకత్వంలో సర్వాన్డ్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మించింది.