‘మహానుభావుడు’ ఆడియో విడుదల తేదీ ఖరారు !

13th, September 2017 - 01:00:42 PM


యంగ్ హీరో శర్వానంద్ నటించిన చిత్రం ‘మహానుభావుడు’ ఈ నెల 29న రిలీజుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ చిత్ర ఆడియో ఆల్బమ్ నుండి విడుదలైన రెండు పాటలు మంచి ఆదరణ పొంది పూర్తి ఆడియో ఎప్పుడెప్పుడు వస్తుందా అనేలా ప్రేక్షకుల్ని ఎదురుచూసేలా చేశాయి. వారి ఎదురుచూపులు ఫుల్ స్టాప్ అనేట్టు ఈ నెల 16న ఆడియో వేడుకను నిర్వహించాలని ప్లాన్ చేశారు దర్శక నిర్మాతలు.

అంతేగాక ఈ కార్యక్రమానికి రెబల్ స్టార్ ప్రభాస్ ముఖ్య అతిధిగా హాజరవుతుండటంతో ప్రేక్షకుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో శర్వానంద్ సరసన మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటించింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించింది. మారుతి యొక్క అన్ని సినిమాల్లాగే ఈ చిత్రం కూడా విభిన్నమైన హీరో క్యారెక్టరైజేషన్ ఆధారంగా తెరకెక్కింది.