విడుదలకు సిద్దమైన ‘మహానుభావుడు’ టైటిల్ సాంగ్!


‘శతమానంభవతి, రాధ’ వంటి చిత్రాల విజయాలతో ఫామ్ లో ఉన్న యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం మారుతి డైరెక్షన్లో ‘మహానుభావుడు’ అనే సినిమా చేస్తున్నాడు. అతి శుభ్రత అనే భిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ చిత్రం యొక్క టీజర్ కూడా ఇటీవలే విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. ఇందులో హీరో క్యారెక్టరైజేషన్ ను చూసిన ప్రేక్షకులు సినిమా పట్ల ఆసక్తిగా ఉన్నారు.

ఇకపోతే చిత్ర టీమ్ టైటిల్ సాంగ్ ను సిద్ధం చేసి ఈ నెల 7న ఉదయం 8 గంటల 45 నిముషాలకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేసింది. ఈ మేరకు ప్రకటన కూడా చేసింది. దసరా కానుకగా రిలీజ్ కానున్న ఈ చిత్రంలో శర్వానంద్ సరసన మెహ్రీన్ కౌర్ నటిస్తుండగా యువీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్-2 బ్యానర్లు సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి.