స్టార్ హీరోయిన్ తో ‘మ‌హారాజ’ డైరెక్ట‌ర్ మూవీ..?

స్టార్ హీరోయిన్ తో ‘మ‌హారాజ’ డైరెక్ట‌ర్ మూవీ..?

Published on Jul 2, 2024 12:17 PM IST

వ‌ర్స‌టైల్ యాక్ట‌ర్ విజ‌య్ సేతుప‌తి కెరీర్ లో 50వ చిత్రంగా తెరకెక్కిన ‘మ‌హారాజ’ బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. పూర్తి క్రైమ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా వ‌చ్చిన ‘మ‌హారాజ’ చిత్రాన్ని దర్శ‌కుడు నిథిల‌న్ సామినాథ‌న్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో విజ‌య్ సేతుపతి యాక్టింగ్ తో పాటు స్క్రిన్ ప్లేకు మంచి మార్కులు ప‌డ్డాయి.

ఈ సినిమాను ద‌ర్శ‌కుడు నిథిల‌న్ సామినాథ‌న్ మ‌లిచిన తీరుకు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. దీంతో ఈ సినిమా సాలిడ్ వ‌సూళ్ల‌తో మంచి విజ‌యాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా త‌రువాత నిథిల‌న్ తన నెక్ట్స్ ప్రాజెక్టును రెడీ చేసే ప‌నిలో ప‌డ్డాడ‌ట‌. ఇప్పటికే త‌న నెక్ట్స్ మూవీకి సంబంధించి ఓ స్టోరీలైన్ ను స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార‌కు వినిపించాడ‌ట ఈ డైరెక్ట‌ర్.

లేడీ ఓరియెంటెడ్ సినిమా కావ‌డం, స్టోరీలైన్ కూడా సూప‌ర్ గా ఉండ‌టంతో నయ‌న‌తార ఈ సినిమాకు ఓకే చెప్పింద‌ట‌. దీంతో ఈ సినిమా స్క్రిప్టును పూర్తి చేసే ప‌నిలో బిజీగా ఉన్నాడ‌ట ఈ డైరెక్ట‌ర్. ఇక‌ న‌య‌నతార త్వ‌ర‌లోనే ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో న‌టించ‌నుంద‌నే టాక్ సినీ వ‌ర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. మ‌రి ఈ సినిమాకు సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ ఎప్పుడు వ‌స్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు