మహర్షి టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ !


సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న25వ చిత్రం ‘మహర్షి’ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇక ఇంతకుముందు ఈచిత్రాన్ని ఏప్రిల్ 5న విడుదలచేస్తామని ప్రకటించారు కానీ ఈ విడుదల తేదీని మార్చాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఇదిలావుంటే ఈ చిత్రం యొక్క టీజర్ ను మహాశివరాత్రి కానుకగా మార్చి 4న విడుదలచేయనున్నారని సమాచారం. అదే రోజు సినిమా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించే అవకాశం వుంది.

పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు , అశ్వినీ దత్ , పీవీపీ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని హిందీలో కూడా విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.

Exit mobile version