కొత్త రికార్డు సృష్టించిన మహర్షి టీజర్ !

maharshi

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న మహర్షి చిత్రం యొక్కటీజర్ నిన్న విడుదలై పాజిటివ్ రివ్యూస్ ను రాబట్టుకుంది. ఇక ఈ టీజర్ టాలీవుడ్ లో వ్యూస్ పరంగా కొత్త రికార్డు సృష్టించింది.

24 గంటల్లో యూట్యూబ్ లో ఈ టీజర్ 11.1 మిల్లియన్ల వ్యూస్ ను రాబట్టి అత్యధిక వ్యూస్ ను రాబట్టిన టీజర్ గా రికార్డు క్రియేట్ చేసింది. ఇక మహేష్ ,భరత్ అనే నేను 8.6 మిల్లియన్ల వ్యూస్ తో సెకండ్ ప్లేస్ లో వుంది. అయితే లైక్స్ లో మాత్రం ఈ మహర్షి టీజర్ నాల్గవ స్థానంలో వుంది. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి టీజర్ 413 లక్షల లైక్స్ తో అగ్ర స్థానంలో నిలిచింది.

24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను రాబట్టిన టాప్ 5 తెలుగు టీజర్లు (మిల్లియన్లలో):

మహర్షి – 11.1
భరత్ అనే నేను – 8.6
సైరా – 7.21
వినయ విధేయ రామ – 6.8
అజ్ఞాతవాసి – 5.9

Exit mobile version