అదిరిపోయిన “మహా సముద్రం” రిలీజ్ ట్రైలర్..!

Published on Oct 9, 2021 10:24 pm IST


శర్వానంద్, సిద్దార్థ్ ప్రధాన పాత్రల్లో ఋక్ష్ 100 ఫేం అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “మహాసముద్రం”. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మించిన ఈ సినిమాలో అదితీరావు, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తుండగా, జగపతిబాబు, రావు రమేశ్ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 14న రిలీజ్ కాబోతుంది. ఈ నేపధ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

భుజాల మీద ఉన్న బరువును బలమున్నోడు ఎవడన్నా చూపిస్తాడు.. కానీ మనసులో ఉన్న బాధని బంధాల విలువ తెలిసినోడు ఒక్కడే మోయగలడు.. ఆ బంధం ప్రేమైనా.. స్నేహమైనా అంటూ శర్వా చెప్పిన డైలాగ్ అదిరిపోగా, యాక్షన్ సన్నివేశాలు, లవ్ అండ్ ఎమోషన్ సన్నివేశాలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా, రాజ్ తోట సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :