‘నెట్‌ఫ్లిక్స్‌’లోకి వచ్చేసిన శర్వానంద్, సిద్ధార్థ్‌ల ‘మహాసముద్రం’..!

Published on Nov 13, 2021 10:17 pm IST


శర్వానంద్, సిద్దార్థ్ ప్రధాన పాత్రల్లో RX100 ఫేం అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “మహాసముద్రం”. దసరా కానుకగా అక్టోబర్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీలో విడుదల అయ్యింది. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మించిన ఈ సినిమాలో అదితీరావు, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించగా, జగపతిబాబు, రావు రమేశ్ ముఖ్యమైన పాత్రలో నటించారు. ఈ చిత్రానికి చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం అందించగా, రాజ్ తోట సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు.

సంబంధిత సమాచారం :

More