మరో రెండు వారాలు అహ్మదాబాద్‌లోనే మహేష్..!

mahesh
సూపర్ స్టార్ మహేష్, దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్‌ల క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులే కాక ఇండస్ట్రీ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న విషయం తెలిసిందే. ఇద్దరు సౌతిండియన్ లెవెల్ స్టార్స్ కలిసిచేస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఇప్పట్నుంచే అంచనాలన్నీ తారాస్థాయిలో ఉన్నాయి. ఇక ప్రస్తుతం అహ్మదాబాద్‌లో ఓ భారీ షెడ్యూల్ జరుపుకుంటోన్న సినిమా మరో రెండు వారాల పాటు అక్కడే షూటింగ్ జరుపుకోనుంది. ప్రస్తుతం మహేష్ పాల్గొంటుండగా పలు భారీ ఛేజింగ్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

డిసెంబర్ 24తో ఈ షెడ్యూల్ పూర్తవుతుందట. ఇక ఈ షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ 70%పైనే పూర్తవుతుందట. జనవరి 1న టైటిల్‌ను ప్రకటించే ఆలోచనలో టీమ్ ఉంది. ఇక అదేవిధంగా దేశభక్తితో ముడిపడి ఉన్న కథ కావడంతో రిపబ్లిక్ డే రోజున ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేశారట. ఠాగూర్ మధు. ఎన్.వి.ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఎస్.జె.సూర్య విలన్‌గా నటిస్తున్నారు.