మహేష్ 23 టీజర్ ను ప్రత్యేకంగా రూపొందిస్తున్న మురుగదాస్ !


‘బ్రహ్మోత్సవం’ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు కొంత గ్యాప్ తీసుకుని స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుండి అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అవుతూ వచ్చాయి. మరోవైపు చిత్రం మొదలై చాన్నాళ్లు కావొస్తున్నా టీమ్ ఫస్ట్ లుక్, టీజర్ కనీసం టైటిల్ ఏమిటనేది కూడా రివీల్ చేయకుండా ఫ్యాన్స్ ను వెయిట్ చేయిస్తూ వస్తోంది.

చిత్ర సన్నిహిత వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అభిమానుల ఎదురుచూపులకు మంచి ఫలితమే దక్కనుందని తెలుస్తోంది. ఎందుకంటే దర్శకుడు మురుగదాస్ చిత్ర టీజర్ ను భారీ గ్రాఫికల్ వర్క్ తో, హై క్వాలిటీలో ఉండేలా రూపొందిస్తున్నారట. అది కూడా యూకేలో కావడం విశేషం. 30 సెకన్ల నిడివి ఉండే ఈ టీజర్ ద్వారా సినిమా కథ ఏమిటనేది చెప్తారట. ఇకపోతే మహేష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా నటించనున్న ఈ చిత్రం కొత్త షెడ్యూల్ రేపటి నుండి ముంబైలో మొదలుకాననుంది. ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తోంది.